Abn logo
Aug 7 2020 @ 01:56AM

యూఏఈలో భారీ అగ్నిప్రమాదం!

అబుధాబి: యూఏఈలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అజ్మన్ మార్కెట్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా.. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాదాపు 25 అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. సుమారు 3 గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. బీరూట్ పేలుళ్ల ఘటన మరువకముందే.. ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 


Advertisement
Advertisement
Advertisement