Abn logo
Sep 27 2020 @ 13:39PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Kaakateeya

బెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు.

మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్‌ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా పోలీసులు గుర్తించారు. కాగా వీరందరూ అలండ్‌ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందినవారు. అందులోబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడానికి వీరంతా కలబురగికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కలబురగి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Advertisement
Advertisement
Advertisement