Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD: మసాజ్‌ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్/ఏఎస్‎రావునగర్‌: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్న ఓ ఇంటిపై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఏఎ్‌సరావునగర్‌లోని ఓ వస్త్ర షోరూం సమీపంలోని ఒక ఇంట్లో మేడిపల్లి మహేష్‌(24) అనే వ్యక్తి గ్లోవిష్‌ స్పా అండ్‌ బ్యూటీ కేర్‌ పేరిట కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.   మహిళలతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు.  నిర్వాహకుడు మహే్‌షతో పాటు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహే్‌షపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
Advertisement