Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

తిరుపతి: వివాహేతర సంబంధాలు జిల్లాలో ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. తిరుపతి డివిజన్‌లోని కె.వి పల్లి మండలం మూల హరిజనవాడలో ఈ దారుణం జరిగింది.  గ్రామంలోని వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆ మహిళను దాసయ్య భార్య నాగసుబ్బు(40) గా గుర్తించారు. దాసయ్యకు ఇదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దాసయ్య వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళతో నాగ సుబ్బు గొడవపడింది. ఆ తరువాత ఏమి జరిగిందో తెలయదు కానీ కొంతసేపటికి నాగ సుబ్బు మృతి చెంది కనిపించింది. ఆ మహిళ కొట్టడంతోనే నాగ సుబ్బు మృతి చెందిందని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement