Advertisement
Advertisement
Abn logo
Advertisement

Marijuana paste‌ విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: గంజాయి పేస్ట్‌ను విక్రయిస్తున్న నలుగురిని మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6వేల విలువ చేసే గంజాయి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట ఎస్‌ఐ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం...రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలోని సాహితీ నగర్‌ కాలనీ నివాసి కునిశెట్టి భరత్‌చంద్ర(28) పోస్టాఫీసులో ఎస్కార్ట్‌ సర్వీసులో పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్‌ బృందావన్‌ కాలనీ నివాసి బిట్రగుట్ట శ్రీనివా్‌సరావు అలియాస్‌ సాయికిరణ్‌(24) టాటూ ఆర్టిస్ట్‌. సరూర్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీ కమలానగర్‌ నివాసి కొత్త గొల్ల అశోక్‌(28) కారు డ్రైవర్‌. సరూర్‌నగర్‌ నివాసి చంద్రశేఖర్‌(26) వీరందరికీ స్నేహితుడు.


గుంటూరు నివాసి శశిధర్‌ ద్వారా చంద్రశేఖర్‌ గంజాయి పేస్ట్‌ను ఆర్టీసీ బస్సులో పార్శిల్‌లో నగరానికి తరలించడంలో మధ్యవర్తిగా వ్యవహరించాడు. రెండు డబ్బాలలో 5గ్రాముల చొప్పున గంజాయి పేస్ట్‌ను రూ.6వేలకు భరత్‌చంద్ర, శ్రీనివా్‌సరావు, అశోక్‌ కలిసి కొనుగోలు చేశారు. ఒక గంజాయి పేస్ట్‌ను ఈ ముగ్గురూ సిగరెట్‌కు పూసి తాగారు. మరో డబ్బాలోని 5గ్రాముల గంజాయి పేస్ట్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. ఒక్కో గ్రాము గంజాయి పేస్ట్‌ను రూ.2వేలకు విక్రయించేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఎంఆర్‌ఆర్‌ బార్‌ వద్ద ప్రయత్నిస్తుండగా, మలక్‌పేట పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. భరత్‌చంద్ర, శ్రీనివా్‌సరావు, అశోక్‌ మంగళవారం రాత్రి, చంద్రశేఖర్‌ బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు. శశిధర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసును మలక్‌పేట ఎస్‌ఐ సుభాష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement