Abn logo
May 28 2020 @ 23:49PM

ఇండస్ట్రీలో అందర్నీ పిలవలేదు!

ఈ వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పందించారు. బాలకృష్ణ అలా ఎందుకన్నారో తనకు తెలియదనీ, పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడతానని ఆయన అన్నారు. ఇంకా తలసాని మాట్లాడుతూ ‘‘ఆ విజువల్స్‌ ఎప్పటివో అని ఒకరు అన్నారు. ఇప్పటివే అని ఇంకొకరు అన్నారు. స్పష్టత వచ్చిన తర్వాత నేను మాట్లాడతా. ఇండస్ట్రీలో అందరినీ మేం పిలవలేదు. యాక్టివ్‌గా ఉన్న దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు సంబంధించిన అంశం. కాబట్టి అందరినీ పిలవలేదు. ఇండస్ట్రీ అందర్నీ పిలిచి మీటింగ్‌ పెట్టాలంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అసోసియేషన్‌లు చొరవ తీసుకుంటే నేను వచ్చి మీటింగ్‌ పెడతా’’ అన్నారు.


Advertisement
Advertisement
Advertisement