Abn logo
May 26 2020 @ 03:19AM

మనోజ్‌ ప్రభాకర్‌ పింఛనుకు బోర్డు ఓకే

దుబాయ్‌: వివాదాస్పద భారత ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అతడికి రావాల్సిన పింఛను ఇచ్చేందుకు బీసీసీఐ అంగీకరించింది. ఈ విషయాన్ని భారత క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా వెల్లడించారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ప్రభాకర్‌పై బీసీసీఐ విఽధించిన ఐదేళ్ల నిషేధం 2005లో ముగిసింది. అప్పటినుంచీ తనకు అందాల్సిన పింఛనుకోసం మనోజ్‌ ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement