Aug 3 2021 @ 21:34PM

ఇద్దరు పిల్లలతో.. ‘మన్మథుడు’ అన్షు ఇప్పుడెలా ఉందో చూశారా?

కింగ్ నాగార్జున ‘మన్మథుడు’ చిత్రంలో మహి పాత్రలో క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ అలరించిన అన్షు.. ఆ చిత్రంతో నటిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాఘవేంద్ర’ చిత్రంలో కూడా ఆమె నటించింది. శివాజీ హీరోగా నటించిన ‘మిస్సమ్మ’ చిత్రంలో ఓ అతిథిపాత్రలో మెరిసింది. తమిళ్‌లో ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా మంచి పేరు వస్తున్న సమయంలోనే.. అన్షు సినిమాలకు దూరమైంది. తర్వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇద్దరు పిల్లలతో, భర్తతో హాయిగా జీవనం సాగిస్తున్న అన్షు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె ఎలా ఉందో చూడండి.