Abn logo
May 30 2020 @ 11:44AM

మ‌ణిర‌త్నం భారీ చిత్రానికి బ్రేక్‌..?

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొం దిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో విక్రమ్‌, కార్తీ, శరత్‌కుమార్‌, జయం రవి, ప్రభు, జయరామ్‌, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్యలక్ష్మి తదితరులు న‌టిస్తున్నారు. థాయ్‌లాండ్‌ అడవుల్లో కీలకమైన దృశ్యాలను కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత చెన్నైలో భారీ సెట్టింగ్‌లు నిర్మించి షూటింగ్‌ జరపాలని మణిరత్నం నిర్ణయించారు. ఆ లోగా కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞలు అమలులోకి రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా ఈ చార్రితక చిత్రంలో పలు యుద్ధ సన్నివేశాల్లో నటించేందుకు వందలాదిమంది ఫెఫ్సీ కార్మికులు అవసరం. అయితే ఇప్పటికిప్పుడు వందల సంఖ్యలో జనాన్ని పోగు చేసి కరోనా నిబంధనలు పాటించడం కష్టం. ఈ పరిస్థితులలో మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం షూటింగ్‌కు సుదీర్ఘ విరామం ప్రకటించారు. ఆ లోగా అరవింద్‌సామితో ఓ కొత్త సినిమా తీయడానికి సన్నాహాలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటివద్దే ఉంటూ మణిరత్నం కొత్త కథకు సంబంధించి స్ర్కిప్టు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement