Oct 19 2021 @ 13:03PM

Manike Mage Hithe: వైరల్ సింగర్ బాలీవుడ్‌ ఎంట్రీ!

మణికే మాగే హితే అంటూ తన వాయిస్‌తో ఇంటర్నెట్ ఫిదా చేసింది శ్రీలంక గాయని, రాపర్ యొహానీ డిలోకా డిసిల్వా. తన స్వరంతో సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపేసిన యొహానీ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటిస్తున్న `థాంక్ గాడ్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్ని కోట్ల వ్యూస్ దక్కించుకున్న `మణికే మాగే హితే` హిందీ వెర్షన్‌ను ఆ సినిమా కోసం సిద్ధం చేస్తోంది. 


ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో యొహానీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ పాటను రష్మి విరాగ్ రాయగా, తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. భారత్ వచ్చేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని యొహానీ చెప్పింది. హిందీ వెర్షన్ మరింత మందిని ఆకట్టుకుంటుందని ఆకాంక్షించింది. 


Bollywoodమరిన్ని...