Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎపీ శాసనసభలో పరిణామాలు చూస్తే ఆవేదన కలుగుతోంది: మండలి బుద్ద ప్రసాద్

కృష్ణా జిల్లా: శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం వంటిదని, ప్రతి ఒక్కరూ దాని పవిత్రతను కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఎపీ శాసనసభలో జరిగిన పరిణామాలు చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. అసలు ఎటువంటి పదాలు వాడకూడదో అన్న నిబంధనలు ఉన్నాయన్నారు. అలాంటిది సభలో వినలేని, వినకూడని పదాలను సభ్యులు మాట్లాడుతున్నారని, ముఖ్యంగా స్త్రీలను కూడా కించపరిచేలా శాసన సభలో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులను ఎదిరించలేక.. ఇంట్లో ఆడవాళ్లను తిట్టే పరిస్థితికి దిగజారారని విమర్శించారు. శాసన సభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే... ఆ రోజుకు సభ్యుడిని సస్పెండ్ చేసే విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే స్పీకర్ల సదస్సులో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం చేయాలన్నారు. ఇలాంటివి అమలు చేస్తేనే శాసన సభ పవిత్రను కాపాడే అవకాశం ఉంటుందని మండలి బుద్ద ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement