Abn logo
Mar 27 2020 @ 12:43PM

బాలకృష్ణతో మంచు విష్ణు?

మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పన్ కోషియమ్` సినిమా హక్కులను దక్కించుకుంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. ఈ సినిమాను ఇద్దరు హీరోలతో తెలుగులోకి రీమేక్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో ఒక పాత్రకు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను అనుకుంటున్నారు. 


మరో హీరో ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బాలయ్యతో మంచి అనుబంధం కలిగిన మంచు విష్ణు అయితే బెటర్ అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు అయితే బాలయ్య కూడా ఓకే అంటారని నిర్మాత భావిస్తున్నారట. త్వరలోనే బాలయ్యతోనూ, మంచు విష్ణుతోనూ సంప్రదింపులు జరపాలని నిర్మాత నాగవంశీ అనుకుంటున్నారట. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement