Abn logo
Sep 15 2021 @ 08:19AM

Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 17 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని  ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 92205 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 92205 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ  19.0918 టీఎంసీలుగా ఉంది.