Abn logo
Sep 24 2021 @ 11:28AM

Hathras: బాలికపై హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు

నోయిడా : హథ్రాస్ కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, చంపిన కేసులో దోషి అయిన మోను ఠాకూర్ కు స్థానిక పోక్సో కోర్టు మరణశిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.35 ఏళ్ల వయస్సున్న దోషి మోను ఠాకూర్ మైనర్ బాలికపై అత్యాచారం చేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.పోలీసులు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఠాకూర్ పై సెక్షన్ 354, 326,452,302, 376, పోక్సోచట్టాల కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసులో కేవలం 42 రోజుల్లో ఛార్జ్ షీట్ సమర్పించారు.ఎస్పీ వినీత్ జైస్వాల్ సత్వర విచారణ జరిపి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. హత్యాచారం కేసులో దోషి అయిన మోను ఠాకూర్ కు పోక్సో కోర్టు న్యాయమూర్తి ప్రతిభా సక్సేనా మరణశిక్ష విధించారు. దీంతోపాటు దోషికి రూ.1.68 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...