Abn logo
Aug 13 2020 @ 23:17PM

భార్యపై ఆమె మేనమామ అత్యాచారం! భర్తకు 2 లక్షల పరిహారం!

పాట్నా: భార్య మేనమామ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసిన ఓ భర్త ఆమెను తిరిగి స్వీకరించేందుకు నిరాకరించాడు. బీహార్‌లోని కతీహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.  నిందితుడు కొన్ని నెలలుగా బాధితురాలిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని కూడా ఆమెను హెచ్చరించాడన్నారు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదో నెల అని సమాచారం. కాగా.. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడు భార్యతో తెగదెంపులు చేసుకున్నాడు. ఆ బిడ్డకు తండ్రో ఎవరో అతడి వద్దే ఉండాలంటూ అతడు భార్యకు తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితురాలు తన మేనమామపై ఫిర్యాదు చేసింది. ఇంట్లోంచి గెంటేశారంటూ తన తాతయ్యపై కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమపై కేసు పెట్టొద్దని, ఇప్పటికే తాము భర్తకు రెండు లక్షల రూపాయలు పరిహారం కింద ఇచ్చామని నిందితులు పోలీసులను వెడుకున్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement
Advertisement