Abn logo
May 28 2020 @ 01:47AM

కెనడా వాసికి వింత అనుభవం.. హెయిర్ క్రీమ్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఆర్డర్ చేస్తే..!

ఒట్టావా: కెనడాలోని టొరెంటొకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఎనిమిదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువు.. అకస్మాత్తుగా తన ఇంటి గుమ్మం వద్ద ఉండేసరికి అతను ఒక్కసారిగా షాక్‌కు గురై, తరువాత నవ్వుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టొరెంటొకు చెందిన ఇలియట్ బెరిన్‌స్టెయిన్ అనే వ్యక్తి 2012‌లో ఆన్‌లైన్ ద్వారా ఓ హెయిర్ క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. అయితే రోజులు గడిచినా అది అతనికి డెలివరీ కాలేదు. దీంతో అతను.. రీటైలర్‌ను సంప్రదించి.. జరిగిన విషయం చెప్పి.. మరోసారి హెయిర్ క్రీమ్‌ను డెలివరీ చేయమని కోరాడు. వాళ్లు సరే అన్నారు. కానీ అతనికి మాత్రం ఆ హెయిర్ క్రీమ్ డెలివరీ కాలేదు. దీంతో అతను దాని గురించి ఆలోచించడం మానేశాడు. అయితే అతను 2012‌లో ఆర్డర్ చేసిన ఎయిర్ క్రీమ్‌ను.. సరిగ్గా ఎనిమిదేళ్లకు (2020 మే)లో పోస్టాఫీస్ వాళ్లు డెలివరీ చేశారు. పోస్టాఫీస్ సిబ్బంది కాలింగ్ బెల్ కొట్టి, కొరియర్ బాక్స్ చేతిలో పెట్టగానే అయోమయానికి గురైన బెరిన్‌స్టెయిన్.. తాను ఏం ఆర్డర్ చేయలేదు కదా అనుకుంటూనే ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో తాను ఎమిదేళ్ల క్రితం ఆర్డర్ చేసిన హెయిర్ క్రీమ్, దాని ఇన్‌వాయిస్ చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం షాక్ నుంచి తేరుకుని బిగ్గర నవ్వుకున్నాడు. కాగా.. ఈ విషయాన్ని స్థానిక మీడియాతో పంచుకున్న ఆయన.. ఆ హెయిర్ క్రీమ్ కాల పరిమితి కూడా తీరిపోయినట్టు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘటపై స్పందించిన పోస్టాఫీస్ అధికారులు.. విచారణ జరపనున్నట్లు వెల్లడించారు. 



Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement