Abn logo
Oct 13 2021 @ 23:56PM

బస్సు ఢీకొని వ్యక్తి మృతి


ఆర్మూర్‌టౌన్‌, అక్టోబరు13: పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన జలందర్‌ (53) బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ సైదేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్‌ మండలం వెంకటాపూర్‌లోని బంధువుల ఇంటికి బైక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా పెర్కిట్‌ శివారులో బుధవారం ఆర్మూర్‌ నుంచి వరంగల్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య బొమ్మెన గంగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.