Abn logo
Jul 11 2020 @ 22:37PM

గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయబోయి.. నీటిలో జారిపడ్డ యువకుడు.. చివరికి!

వాషింగ్టన్: ప్రేమించిన వారికి.. తమ ప్రేమను తెలియజేయడానికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని, ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ప్రపోజ్ చేసే విధానంతో.. ఎదుటి వ్యక్తి ప్రేమించేలా ప్లాన్ చేసుకుంటారు. సరిగ్గా ఈ కోవకు చెందిన వాడే.. అమెరికాకు చెందిన జాక్సన్ కూడా. తన గర్ల్‌ఫ్రెండ్ మరియా గుగ్లోట్టాకు ప్రపోజ్ చేయడానికి ఆమెను సముద్ర తీరానికి తీసుకెళ్లాడు. మరియా గుగ్లోట్టాకు.. సముద్ర తీరాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. లవ్‌ను ప్రపోజ్ చేయడానికి జాక్సన్ వెనక నుంచి వెళ్లి.. నీళ్లలో జారీ పడ్డాడు. దీంతో వెనక్కి తిరిగిన మరియా గుగ్లోట్టాకు.. జాక్సన్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. జాక్సన్ ప్రపోజ్ చేసిన విధానానికి ఫిదా అయిన మరియా గుగ్లొట్టా.. జాక్సన్ ప్రేమను అంగీకరించింది. తన అంగీకారాన్ని ముద్దిచ్చి వ్యక్తపర్చింది. దీంతో అక్కడున్న వారు కేరింతలు కొట్టారు. కాగా.. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి.. నెట్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 


Advertisement
Advertisement
Advertisement