Abn logo
May 29 2020 @ 15:03PM

నీ భర్త నిన్ను తీసుకురమ్మన్నాడంటూ స్నేహితుడి భార్యను కారులో తీసుకెళ్లి..

స్నేహితుడి భార్య కిడ్నాప్‌.. అత్యాచారం


ఏలూరు (ఆంధ్రజ్యోతి): స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి, ఆమెను పుట్టింటి నుంచి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితోపాటు అతనికి సహకరించిన మరొకరిని  పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌  త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఏలూరు రామకృష్ణాపురంలోని ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్‌ పల్లి నానిబాబు, మరో డ్రైవర్‌ స్నేహితులు. నానిబాబుకు అతని భార్యతో మనస్పర్థలు రావడంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒక గదిలో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఈ నెల 9న ఆమె ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. స్నేహితుడు కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నానిబాబు ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్‌ చేసి.. ‘నిన్ను నీ భర్త తీసుకురమ్మని చెప్పాడు. నేను కిరాయికి భీమడోలు వచ్చాను’ అని నమ్మబలికాడు. మరో డ్రైవర్‌ వాసాది కాశీ(31) సహకారంతో ఆమెను కారులో ఏలూరులోని నానిబాబు గదికి తీసుకొచ్చి బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన ఆమె భర్త వచ్చి భార్యను విడిపించి తీసుకెళ్లాడు. బాధితురాలు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మూర్తి కేసు నమోదు చేశా రు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులైన నాని బాబు, కాశీలను అరెస్ట్‌ చేసి కారును సీజ్‌ చేశారు.   


బాలికపై అత్యాచారం : యువకుడిపై కేసు

బాలికపై అత్యాచారం చేసిన యువకుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తణుకు ఇన్‌ చార్జి సీఐ ఆకుల రఘు తెలిపారు. గురువారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం కు చెందిన దర్శపాముల చంటియ్య అత్తిలి మండలంలో ఇళ్ల స్థలాల పూడిక పనులకు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వచ్చాడు. గ్రామం లో బాలికను శివారు ప్రాంతానికి బాలికను తీసుకెళ్లి అత్యా చారం చేశాడని సీఐ తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో బుధవారం తండ్రి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Advertisement
Advertisement
Advertisement