Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉదయం 9 గంటలకు హైవేపై తప్పు చేస్తూ అడ్డంగా బుక్కైన వ్యక్తి.. అతడు చేసిన పని నెట్టింట వైరల్ కావడంతో విస్తుపోతున్న నెటిజన్లు!

ఎన్నారై డెస్క్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఉదయంపూట హైవే రోడ్డుపై అతడు చేసిన పని గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎంత అర్జెంట్ అయితే మాత్రం ఇలా చేయాలా అంటూ కామెంట్లు పెడుతూ రెచ్చిపోతున్నారు. కాగా.. ఉదయంపూట హైవేపై అతడు ఏం చేశాడు. అతడు చేసిన పని ఎందుకు వైరల్ అయింది. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి గురువారం రోజు ఓ పనిపై బయటికెళ్లాడు. ఈ క్రమంలోనే ఉదయంపూట 9 గంటలకే తీవ్రంగా ట్రాఫిక్ ఉండటంతో అతడు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. డ్రైవర్‌తోపాటు కారులో మరో వ్యక్తి ఉన్నపుడు మాత్రమే ప్రయాణించడానికి వీలున్న హై ఆక్యూపెన్సీ లేన్ ద్వారా అతడు తన గమ్యస్థానికి త్వరగా చేరుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే పక్కన ఉన్న ఖాళీ సీటుకు ఓ జాకెట్ వేసి, అచ్చం మనిషి కూర్చున్న విధంగా  దాన్ని సెట్ చేశాడు. పథకం ప్రకారమే.. హై ఆక్యూపెన్సీ లేన్ మీదుగా కారును తొలుతుండగా.. డౌటొచ్చి పోలీసులు అతడి కారును అడ్డుకున్నారు. దీంతో అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా అతడి ఫొటోను ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసి, విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement