Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముళ్లపందులను తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

కారును వెంటాడి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

మామడ, డిసెంబరు 4 :  ముళ్ళపందులను ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు కారులో తీసుకువెళ్తుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో మామడ మండలంలోని మొండిగుట్ట, ఆరేపల్లి మధ్య అటవీప్రాంతంలో వెంబడించి షిఫ్ట్‌ డిజైర్‌ (టీఎస్‌ 02 ఎఫ్‌బీ 7642) వాహనాన్ని ఆపితనిఖీ చేయగా అందులో నాలుగు ముళ్లపందు లు లభ్యమయ్యాయి. నిందితుడిని విచారించారు. జగిత్యాల జిల్లా జస్తపూర్‌ గ్రా మానికి చెందిన రాజేశంగా తెలిపాడు. బోథ్‌ సోనాల నుంచి వారానికి రెండుసార్లు మాంసాన్ని తీసుకువెళ్లి జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో కేజీకి రూ. 800 నుంచి 2,000 వరకు  విక్రయిస్తున్నానని అంగీకరించారు. పట్టుకున్న జంతువులు, కారుని, నిందితుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ అధికారులు సంబంధిత మామడ అటవీ క్షేత్రాధికారికి అప్పగించారు. ఈ సందర్భంగా అటవీక్షేత్ర అధికారి రాథోడ్‌ అవినాస్‌ మాట్లాడుతూ... అటవీచట్టం ప్రకారం నిందితుడిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. 

Advertisement
Advertisement