Abn logo
Oct 23 2020 @ 06:15AM

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 22 : రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక    విలేఖరులతో గురువారం ఆయన మాట్లాడుతూ సరిగ్గా ఐదేళ్లక్రితం ఇదే రోజున అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేశారన్నారు.


టీడీపీ ప్రభుత్వ హయాం మూడున్నర ఏళ్లల్లో అమరావతిలో వేల కోట్లతో రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, డీజీపీ కార్యాలయాలు పూర్తి చేయగా, ఎమ్మెల్యే, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల గృహసముదాయాలు 90 శాతం పూర్తయ్యాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చా క ఇచ్చిన మాట తప్పి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నా రన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శేషయ్య, సుబ్బరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement