Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రఖ్యాత ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి అస్తమయం

హైదరాబాద్: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్‌ శాస్త్రి (96) స్వర్గస్తులయ్యారు. ఉభయ వేదాంత పండితులుగా పేరొందిన చంద్రశేఖర శాస్త్రి ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లలో భద్రాద్రి సీతారామకళ్యాణ వ్యాఖ్యానం సహా ఎన్నెన్నో ప్రవచనాలు చేశారు. తెలుగు, సంస్కృత భాషల్లో గొప్ప పండితులు. ముఖ్యంగా భారతంలో ధర్మసూక్ష్మాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. రామాయణ రహస్య దర్శిని, కృష్ణలహరి వంటి గ్రంథాలు రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన శాశ్వత పండితులుగా సేవలందించిన చంద్రశేఖరశాస్త్రి గుంటూరు జల్లా క్రోసూరులో 1925 ఆగస్టు 28న జన్మించారు.

Advertisement
Advertisement