Abn logo
Sep 24 2020 @ 09:06AM

మాల్దీవుల్లో కొత్త మెరుగులతో బీచ్‌ రెస్టారెంట్‌

Kaakateeya

చెన్నై : మాల్దీవుల సముద్రతీరంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన సీసైడ్‌ ఫినోల్తూ రెస్టారెంట్‌ కొత్త మెరుగులతో నవంబర్‌ 1నుంచి ప్రారంభమవుతుందని ముజా లాబ్స్‌ వ్యవస్థాపకుడు నాదన్‌ హచిన్స్‌ తెలిపారు. ఈ మేరకు చెన్నైలో ఓ  ప్రకటన విడుదల చేశారు. ఈ సముద్రతీర రెస్టారెంట్‌లో ‘బీచ్‌ బబుల్‌’ పేరుతో ఉన్న ప్రత్యేక గదులు పర్యాటకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. విల్లాలు, స్పోర్ట్స్‌ ఫిట్‌నెస్‌ కేంద్రాలు, గోల్ఫ్‌ స్టూడియో, గార్డెన్‌ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రెస్టారెంట్‌ రూములతోపాటూ బబుల్స్‌ గదుల నుంచి పర్యాటకులు సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు తిలకిస్తే వింత అనుభూతికి లోనవుతారని పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement