Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాలమహానాడు ఆధ్వర్యంలో అన్నదానం

గుంటూరు(విద్య),డిసెంబరు 6: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌  వర్ధంతిని పురష్కరించుకుని స్థానిక లాడ్జిసెంటర్‌లో మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం అన్నదానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరై  హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. అంబేద్కర్‌ వర్ధంతి రోజున పేదలకు అన్నదానంచేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్‌, నక్కా ఆనందబాబు, దళిత, ప్రజాసంఘాల నాయకులు బి.స్టాలిన్‌బాబు, భత్తుల అనిల్‌, కనకవల్లి వినయ్‌, శెట్టి అంబేద్కర్‌, చిన్నం డేవిడ్‌ విలియమ్స్‌, నల్లపు నీలాంబరం, బత్తుల వీరాస్వామి, మంచాల మోహన్‌, వాసిల్ల రాజేష్‌, కట్టా దీనరాజు, బత్తులమణి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement