Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 17:21PM

ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేషన్‌ను పండుగ చేసుకున్న మలాలా దంపతులు

న్యూఢిల్లీ : నోబెల్ బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవితంలో ఓ మైలురాయి వంటి ఈ ఘట్టాన్ని ఆమె తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంబరంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 


మలాలా సాధించిన విజయాన్ని ఆమె భర్త అసర్ మాలిక్ ఆస్వాదించారు. ఆమెను ఆయన అభినందించారు. దంపతులిద్దరూ అమితానందంతో కెమెరాలకు పోజులిచ్చారు. మాలిక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ‘‘మేము మొట్ట మొదట కలుసుకున్న ప్రదేశం మలాలా గ్రాడ్యుయేషన్ డే రోజున మరింత ప్రత్యేకతను సంతరించుకుంది’’ అని పేర్కొన్నారు. మలాలా తల్లిదండ్రులు జియావుద్దీన్, టూర్ పెకాయ్‌లను కూడా కలుసుకుని, ఆనందాన్ని పంచుకున్నారు. 


మలాలా, అసర్ ఇటీవలే తమ సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 2018లో తమకు పరిచయం ఏర్పడిందని వెల్లడించారు.


Advertisement
Advertisement