47 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్‌గా, హాట్‌గా కనిపిస్తూ ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెడుతోంది హీరోయిన్ మలైకా అరోరా. ఒక బిడ్డకు తల్లి కూడా అయిన మలైక తన కంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది. వీలు కుదిరినప్పుడల్లా వీరు విహారయాత్రలకు వెళుతూ హల్చల్ చేస్తున్నారు. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను వీరిద్దరూ గోవాలో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి మాత్రం వీరు స్పష్టతనివ్వడం లేదు. వీరి పెళ్లి గురించి తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఈ ఏడాది వేసవిలో వీరిద్దరూ వివాహం బంధంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారట. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.