శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి
ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి
పరిగి: పరిగి పట్టణాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే ఆదర్శంగా నిలుపుతానని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునిసిపల్ పరిధిలో ఐదవ వార్డులో రూ.5 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి మునిసిపల్ పరిధిలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, ఎన్ని నిధులైనా తీసుకరావడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇంటి ముందుకు వచ్చే చెత్తబండిలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ఎం.అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్‌రెడ్డి, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఎంపీపీ అరవింద్‌రావు, వైఎస్ చైర్మన్ ప్రసన్నలక్ష్మీ, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, టి.వెంకటేశ్; ఎదిరె కృష్ణ, మునీరు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మీ, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.