Abn logo
Sep 24 2021 @ 00:00AM

హత్యకేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌

వివరాలు తెలుపుతున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 24 : పాల వ్యాపారి హత్య కేసులో ప్రధాన నిందితుడిని  అరెస్టు చేసినట్టు డీఎస్పీ డాక్టర్‌  రవికిరణ్‌   తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో విలేక రులకు వివరాలు తెలిపారు. ఈ నెల 18న జంగా రెడ్డిగూడెంలో పాల కేంద్రం యజమాని కందు కూరి సురేష్‌ ప్రభును వేటకత్తితో నరికి హత మార్చిన కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి చిరం జీవి అలియాస్‌ చందును శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చా మన్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమన్నారు.  సమావేశంలో సీఐ గౌరీశంకర్‌ తదితరులు ఉన్నారు.