మహేష్ - త్రివిక్రమ్ మూవీ ఇంకా లేట్ అవుతుందా..?

మహేష్ బాబుకు సర్జరీ జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొద్దిపాటి టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉండటంతో మహేశ్ సర్జరీ చేయించుకునేందుకు సిద్దమవుతున్నారట. ఈ సర్జరీ తర్వాత కనీసం రెండు నెలలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు చేస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంతో పాటు జనవరి నుంచి సెట్స్‌పైకి వస్తుందనుకున్న మహేశ్ - త్రివిక్రమ్ మూవీ కూడా ఆలస్యంగా మొదలవనుందని సమాచారం. వాస్తవంగా అయితే ఈ డిసెంబర్‌కు 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలనుకున్నారు మహేశ్. అయితే, ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి ఈ కాంబో మూవీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022, ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. 

Advertisement
Advertisement