Abn logo
Jun 2 2020 @ 13:32PM

విదేశీ షెడ్యూల్ రిజెక్ట్ చేసిన మ‌హేశ్‌?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ ప‌తాకాల‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. రీసెంట్‌గా ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాలో క‌థానుగుణంగా కీల‌క‌మైన షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీక‌రించాల్సి ఉంద‌ట‌. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా మ‌హేశ్ ఆ షెడ్యూల్‌ను వ‌ద్ద‌ని, సినిమా అంతా ఇండియాలోనే న‌డిచేలా ప్లాన్ చేయ‌మ‌ని చెప్ప‌డంతో ప‌రుశురామ్ చిన్న పాటి మార్పులు చేసేశాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement