Abn logo
May 30 2020 @ 12:51PM

మహేష్‌ను ఏమైనా అడగాలనుకుంటున్నారా?

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నాడు. 


త్వరలో అభిమానులతో టచ్‌లోకి కూడా రాబోతున్నాడు. వారడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మహేష్ ముచ్చటించనున్నాడు. #AskSSMB హ్యాష్‌ట్యాగ్‌ జోడించి మహేష్‌ను ప్రశ్నించవచ్చు. ఆదివారం సూపర్‌స్టార్ క‌‌ృష్ణ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ సినిమాను మహేష్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement