Abn logo
Jun 2 2020 @ 11:12AM

శిరీష్ `నో`.. మహేష్ `ఓకే`?

అల్లు హీరో శిరీష్‌తో దర్శకుడు పరశురామ్ గతంలో `శ్రీరస్తు శుభమస్తు` సినిమా రూపొందించాడు. ఈ సినిమా శిరీష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. నిజానికి `శ్రీరస్తు శుభమస్తు` కంటే ముందు శిరీష్‌కు పరశురామ్ రెండు కథలు చెప్పాడట. ఆ రెండు కథలను రిజెక్ట్ చేసిన శిరీష్ `శ్రీరస్తు శుభమస్తు` కథను సెలెక్ట్ చేసుకున్నాడట. 


శిరీష్ రిజెక్ట్ చేసిన రెండు కథల్లో మొదటిది `గీతగోవిందం` అని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ రూపొందించిన ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇక, రెండో కథే `సర్కారు వారి పాట` అని ప్రచారం జరుగుతోంది. బ్యాంకుకు టోపీ పెట్టిన ఓ పెద్ద రాజకీయనాయకుడి నుంచి హీరో డబ్బులను ఎలా వసూలు చేశాడన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. `గీతగోవిందం`లాగానే ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని దర్శకుడు గట్టి నమ్మకంతో ఉన్నాడట. 

Advertisement
Advertisement
Advertisement