Abn logo
Apr 7 2020 @ 17:10PM

మహేష్ సినిమాకు నిర్మాతలు ఎంతమంది?

`సరిలేరు నీకెవ్వరు` తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాలని సూపర్‌స్టార్ మహేష్ బాబు అనుకున్నారు. అయితే కథ నచ్చకపోవడంతో వంశీపైడిపల్లి సినిమాను పక్కనపెట్టారు. `గీతగోవిందం` దర్శకుడు పరశురామ్‌కు ఓకే చెప్పారు. ఈ సినిమా కోసం మూడు నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. 


మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎమ్‌బీతోపాటు, మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ మూడు సంస్థలతోపాటు దర్శకుడు కొరటాల శివకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉందట. ఎందుకంటే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా చేయాలని కొరటాల గతంలో ప్లాన్ చేశారు. మహేష్ దగ్గరకు పరశురామ్‌ను తీసుకెళ్లి కథ చెప్పించారు. అయితే అప్పుడు పరుశురామ్‌కు `నో` చెప్పిన మహేష్ బాబు.. ఇప్పుడు అదే కథతో సినిమా చేయబోతున్నారు. కాబట్టి కొరటాల శివకు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమాకు లాభాలు వస్తే నలుగురు పంచుకోవాలన్న మాట. 

Advertisement
Advertisement
Advertisement