Apr 16 2021 @ 16:07PM

మహేష్ లెక్క చేయడం లేదా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది. జనవరిలో మొదలైన సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్‌లోనే ప్లాన్ చేసిన చిత్ర బృందం కరోనా సెకండ్ వేవ్ కారణంగా అక్కడ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్‌లో 25రోజులు ప్లాన్ చేశారు. వాస్తవంగా మహేష్ సినిమా కూడా షూటింగ్ పోస్ట్‌పోన్ చేస్తారన్న టాక్ వినిపించింది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న కారణంగా టాలీవుడ్ సహా బాలీవుడ్ సినిమాలను షూటింగ్ దశలో నిలిపేస్తున్నారు. అంతేకాదు పక్కాగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాల రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం సినిమాలు అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ఆయా చిత్ర బృందం ప్రకటించారు. మెగాస్టార్ ఆచార్య సినిమా కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ మాత్రం తన సర్కారు వారి పాట సినిమాని పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది. అన్నీ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నారట. అంతేకాదు జులై వరకు ఈ సినిమాను పూర్తి చేసి ఆగస్టు ను నుంచి కొత్త ప్రాక్జెక్ట్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే కరోనా సెకండ్ వేన్‌ని లెక్క చేయకుండా పకడ్బందీ నిబంధనలతో సర్కారు వారి పాట పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతమందిస్తున్నాడు.