Oct 15 2021 @ 16:15PM

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఎప్పుడు అన్న విలేకర్ల ప్రశ్నకు Mahesh Babu రియాక్షన్ ఇదీ..!

‘సర్కారు వారి పాట’తో మన ముందుకు రాబోతున్నాడు మహేశ్ బాబు. అయితే, సూపర్ స్టార్ నెక్ట్స్ సినిమా విషయంలో ఫ్యాన్స్‌కి ఎలాగూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ, ఈ సారి ప్రిన్స్ తరువాతి చిత్రం కంటే కూడా ఆ తరువాతి ప్రాజెక్ట్‌పై అందరి ఆసక్తి తీవ్రంగా నెలకొని ఉంది. ఎందుకంటే, మన ‘రాజకుమారుడు’ త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళి కోసం కెమెరా ముందుకు వెళ్లనున్నాడు!


మహేశ్ బాబుతో రాజమౌళి చిత్రం కోసం ఫ్యాన్సే కాదు సాధారణ జనం కూడా ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎట్టకేలకు సూపర్ స్టార్‌తో సూపర్ డైరెక్టర్ మూవీ ప్రారంభం కానుందట. ఈ విషయాన్ని స్వయంగా మహీనే మీడియాకు చెప్పాడు. ‘బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడ’న్న జర్నలిస్టుల ప్రశ్నకు ఆయన ‘హిందీ సినిమా చేసే సమయం ఆసన్నమైంద’ని జవాబిచ్చాడు. అంతే కాదు, రాజమౌళితో తాను చేసే భారీ బడ్జెట్ మూవీ పలు భాషల్లో విడుదలవుతుందని వివరించాడు. హిందీలో కూడా తమ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతుందని పేర్కొన్నాడు. అంటే, మన దర్శక ‘బాహుబలి’ నెక్ట్స్ సినిమానే ‘శ్రీమంతుడి’ బాలీవుడ్ ఎంట్రీగా భావించవచ్చన్నమాట! 

Bollywoodమరిన్ని...