May 11 2021 @ 10:47AM

క్రికెట్ కోచ్‌గా మహేష్..?

సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రికెట్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రస్తుతం న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే మహేష్ బాబుతో తన సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి అందరిలో కథ గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్‌ను ఆర్మీ ఆఫీసర్‌గా చూపించిన అనిల్ రావిపూడి ఈసారి ఎలా చూపించబోతున్నాడో అని అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ నేపథ్యంలో సాగే కథను సిద్దం చేసినట్టు.. మహేష్‌ను కోచ్‌గా చూపించేందుకు అనిల్ రావిపూడి పాన్ ఇండియన్ రేంజ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే మహేష్ - అనిల్ కాంబినేషన్‌లో మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు. మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చేస్తున్నాడు. తర్వాత త్రివిక్రం, అనిల్ రావిపూడి సినిమాలు ఉండబోతున్నాయి.