Abn logo
May 23 2020 @ 10:42AM

హైట్ విష‌యంలో కొడుకుతో మ‌హేశ్ పోటీ

ఏ మాత్రం ఖాళీ దొరికినా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ ఆ స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతుంటాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో గౌత‌మ్‌, సితార‌ల‌తో స‌రదాగా ఆటాలాడుతున్నారు. మ‌హేశ్ పిల్ల‌ల‌తో ఉన్న ఫొటోల‌ను వీడియోల‌ను న‌మ‌త్రా శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మ‌హేశ్ కొడుకు గౌత‌మ్‌తో హైట్ విష‌యంలో పోటీ ప‌డుతున్న‌ట్లు ఉండే వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ వీడియోను మ‌హేశ్ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌డం. గౌత‌మ్‌ను చూసిన వారంద‌రూ అప్పుడే మ‌హేశ్ అంతా ఎత్తైపోయాడ‌ని అంటున్నారు. 


Advertisement
Advertisement
Advertisement