Advertisement
Advertisement
Abn logo
Advertisement

32వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

నెల్లూరు: అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర 32వ రోజు కొనసాగుతోంది. గురువారం నెల్లూరు జిల్లా, మరిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి తురిమేర్లలో అమరావతి రైతులు బస చేయనున్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ నేత ఆంజనేయులు పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు, వైసీపీ నేతలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.  రైతులు, మహిళలు ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. 


నిన్న పొదలకూరులో రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే భోజనాలు చేశారు. విశ్రాంతికి చోటు లేకుండా చేసి దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రలో ఉన్న క్రైస్తవ, ముస్లిం రథాల్ని పోలీసులు ఆపేయడంపై నిరసన తెలిపారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా పోలీసులు కనికరించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement