Abn logo
Sep 21 2021 @ 07:45AM

Prayagraj: అఖాడా పరిషత్‌ చీఫ్‌ కేసులో శిష్యుడు ఆనంద్ గిరి అరెస్ట్

ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ చీఫ్‌ నరేంద్రగిరి ఆత్మహత్య కేసులో నిందితుడైన అతని శిష్యుడు ఆనంద్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం నివాసంలో మహంత్ నరేంద్రగిరి శవమై కనిపించారు.దివంగత మహంత్ మృతదేహం ఉన్న ప్రదేశం నుంచి ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ లభించింది. అఖాడా పరిషత్ చీఫ్ తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరిని అతని మరణానికి బాధ్యుడిగా సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.మహంత్ ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణతో ఆనంద్ గిరిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే ఆశ్రమంలో కోట్లాదిరూపాయలను మోసం చేసిన కొందరు వ్యక్తుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మహంత్ నరేంద్ర గిరి మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.అఖిల భారతీయ అఖాడా పరిషత్ భారతదేశంలో సాధువుల అతిపెద్ద సంస్థ.మహంత్ నరేంద్ర గిరి మరణం పట్ల ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరుపుతామని శర్మ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...