Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు జిల్లా: మరుపూరులో ప్రారంభమైన మహాపాదయాత్ర

నెల్లూరు జిల్లా: మరుపూరులో బుధవారం ఉదయం రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అయితే అన్ని వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. దీంతో రాజధాని రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.


అడుగడుగునా ఆటంకాలు

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు వైసీపీ శ్రేణులు, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పొదలకూరులో భోజనాల తయారీకి స్థలాలు ఇవ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. భస చేసేందుకు వీలులేక రాత్రి వేళ లారీలు, ట్రాక్టర్లలో రైతులు నెల్లూరుకి వెళ్లారు. మహాపాదయాత్ర సాగే రోడ్ల వెంబడి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ జెండాలు కట్టారు. ఎన్వి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. అడ్డంకులు సృష్టించినా... అమరావతి రైతులు ముందుకు సాగిపోతున్నారు.

Advertisement
Advertisement