Advertisement

Madonna : మగవాడు ‘ఆ భాగం’ చూపితే తప్పు కాదు... స్త్రీ చూపితే తప్పా?

పాప్ సింగర్ మడోన్నాకు కాంట్రవర్సీలు కొత్తేం కాదు. గతంలో ఆమె చాలా సార్లు వివాదాలపాలైంది. మరీ ముఖ్యంగా, తన స్కిన్ షో, గ్లామర్ షోతో మడోన్నా మతులు పోగొట్టడం ఎప్పుడూ జరిగేదే. అది కాస్త శ్రుతి మించినప్పుడు, అడపాదడపా, పెద్ద చర్చ జరగటం కూడా అందరికీ తెలిసిందే. లెటెస్ట్‌గా ఈ 63 ఏళ్ల సీనియర్ సుందరి మరోసారి హాట్ హాట్ కాంట్రవర్సీకి కారణమైంది...


మడోన్నా ఇన్‌స్టాగ్రామ్‌పై సీరియస్ అయింది. నిపిల్ చూపిస్తే తప్పేంటి అంటూ నిప్పులు చెరిగింది. ఇంతకీ, జరిగింది ఏంటంటే... మడోన్నా రీసెంట్‌గా కొన్ని ఫాటోలు పోస్ట్ చేసింది. అవి ఎప్పటిలాగే సెమీ న్యూడ్‌గా ఉన్నాయి. కానీ, ఓ ఫోటోలో ఆమె చనుమొన కొంత భాగం కనిపించేసింది! దాంతో ఎలాంటి వార్నింగ్, నోటీస్ ఇవ్వకుండా ఇన్‌స్టాగ్రామ్ మడోన్నా ఫోటోలు తొలగించింది. తాజాగా మడోన్నా మళ్లీ అవే ఫోటోలు అప్‌లోడ్ చేసింది. అయితే, ఈ సారి తన బ్రెస్ట్ నిపిల్ కనిపించకుండా జాగ్రత్తపడింది. కానీ, ఒక సుదీర్ఘ పోస్టు రాసింది పాప్ సంచలనం... 


మడోన్నా తన లెటెస్ట్ పోస్టులో ఇన్‌స్టాగ్రామ్ పాలసీని తప్పుబట్టింది. ‘‘స్త్రీ శరీరంలో చనుమొన ఒక్కటే కామానికి సంకేతమా? మిగతా అంగాంగాలు అన్నీ మన సంస్కృతిలో ప్రదర్శించనిస్తారు. కానీ, కేవలం చనుమొన విషయంలో అంతగా ఇబ్బంది ఎందుకు?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించింది. స్త్రీ వెనుక భాగం నగ్నంగా చూపినా పట్టించుకోని అమెరికా సమాజం బ్రెస్ట్ నిపిల్స్ విషయంలో మాత్రం తీవ్రంగా స్పందిస్తుంటుందని ఎత్తి చూపిన మడోన్నా, దాని వల్లే, చంటి బిడ్డకి ఆహారం లభిస్తుందని గుర్తు చేసింది. అలాగే, మగవాళ్లు నగ్నంగా తమ యదని ప్రదర్శిస్తే లేని తప్పు మహిళలకు ఎందుకని ఆమె అంటోంది! మేల్ నిపిల్స్‌కి ఓ న్యాయం, ఫీమేల్ నిపిల్స్‌కి మరో న్యాయమా అంటూ మడోన్నా నిలదీసింది...

Advertisement