Apr 16 2021 @ 11:51AM

మహేశ్‌ చిత్రంలో విలన్‌గా విలక్షణ నటుడు..!

సూపర్‌స్టార్‌ మహేశ్ 27వ చిత్రం 'సర్కారువారిపాట'. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. కోవిడ్‌ ఎఫెక్ట్‌ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు యూనిట్‌ సభ్యులు. ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా ఎవరు నటిస్తారు?  అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కోలీవుడ్‌ నటుడు అరవిందస్వామి, శాండివుల్‌ నటుడు ఉపేంద్ర పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వీరిద్దరూ కాకుండా ఇప్పుడు మరో విలక్షణ నటుడు ఈ లిస్టులో చేరాడు. ఆయనెవరో కాదు.. మాధవన్‌. కోలీవుడ్‌, బాలీవుడ్‌లో హీరోగా, విలక్షణ పాత్రల్లో నటించిన మాధవన్‌ టాలీవుడ్‌ మూవీ 'సవ్యసాచి'లో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌ 'సర్కారువారిపాట' చిత్రంలో విలన్‌గా నటింప చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.