Abn logo
Sep 24 2021 @ 00:00AM

కొలువుదీరిన మండలాధీశులు

కొవ్వూరు ఎంపీపీ నారాయుడిని అభినందిస్తున్న మంత్రి వనిత

కొవ్వూరు ఎంపీపీగా కాకర్ల నారాయుడు



కొవ్వూరు, సెప్టెంబర్‌ 24 : కొవ్వూరు మండల పరిషత్‌ అధ్యక్షుడిగా కాకర్ల సత్యనారాయణ (నారాయుడు) ప్రమాణస్వీకారం చేశారు. ప్రిసైడింగ్‌ అధి కారి పి.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కో–ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక నిర్వహించారు. కాపవరం గ్రామానికి చెందిన ఎండి మజ హరుల్లా బేగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీగా వాడపల్లి ఎంపీటీసీ కాకర్ల నారాయుడు, వైస్‌ ఎంపీపీగా పంగిడి ఎంపీటీసీ వీరమళ్ల నారాయుడు ఏకగ్రీవం ఎన్నికైనట్లు ప్రకటించారు. మంత్రి తానేటి వనిత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్‌.రాజీవ్‌కృష్ణ, మాజీ ఎమ్మేల్యే టీ.వి రామారావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ బండి అబ్బులు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, వైస్‌చైర్మన్‌ మన్నె పద్మ, ఉప్పులూరి సూరిబాబు, తదితరులు గజమాలలతో సత్కరించారు. 


బుట్టాయగూడెం ఎంపీపీగా కారం శాంతి


బుట్టాయగూడెం: ఎంపీపీగా కారం శాంతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసై డింగ్‌ అధికారి డి.జోనాథన్‌ తెలిపారు. వైస్‌ ఎంపీపీగా కుక్కల వరలక్ష్మి, కో–ఆప్షన్‌ సభ్యుడిగా సయ్యద్‌ బాజీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్ను కున్నా రు. ముందుగా కో–ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక అనంతరం సభ్యులందరితో అధికా రులు ప్రమాణస్వీకారం చేయించారు. 15 మంది ఎంపీటీసీ సభ్యులలో ఇద్దరు గైర్హాజరయ్యారు. ఎంపిపి అభ్యర్థి ఎంపికలో పార్టీలో గందరగోళం నెలకొనడంతో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏకగ్రీవం అయ్యేలా కృషి  చేశారు. ఎంపీడీవో ఎం.రాజు, ఏవో కిరణ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ కరాటం సీతాదేవి, జడ్పీటీసీ మొడియం రామతులసి, తదితరులు సభ్యులు పాల్గొన్నారు.


పోలవరం ఎంపీపీగా సుంకర వెంకటరెడ్డి


పోలవరం: ఎంపీపీగా సుంకర వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీగా మిడియం సింగరాజు, కోఆప్షన్‌ సభ్యుడిగా పి.చానుతో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డుపై తర్వాత గూటాల వరకు ర్యాలీ నిర్వహించారు, 


కామవరపుకోట ఎంపీపీగా మేడవరపు వెంకట సత్యసాయి విజయలక్ష్మి


కామవరపుకోట: ఎంపీపీగా మేడవరపు వెంకట సత్యసాయి విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. వైస్‌ ఎంపీపీగా కనితెల్లి రత్నకుమారి, కో–ఆప్షన్‌ సభ్యుడిగా మహ్మద్‌ కరీముల్లా ప్రమాణస్వీకారం చేశారు. తొలుత ఎంపీటీసీ సభ్యులతో ఎన్నికల అధికారి ఆనందబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ జీవీవీ.సత్యనారాయణ పాల్గొన్నారు.

నల్లజర్ల ఎంపీపీ, ఎంపీటీసీలను అభినందిస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు

నల్లజర్ల ఎంపీపీగా బంకా జయలక్ష్మి


నల్లజర్ల: ఎంపీపీగా అనంతపల్లికి చెందిన బంకా జయలక్ష్మి ప్రమాణాస్వీకారం చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.శ్రీనివాసరావు సమక్షంలో ఎంపీటీసీ సభ్యులు ప్రమాణాస్వీకారం చేశారు. 23మంది ఎంపీటీసీలకు 22మంది మాత్రమే హాజరయ్యారు. ఎంపీపీగా బంకా జయలక్ష్మిని ఎన్నుకు న్నారు. ఎంపీడీవో వాణి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


చింతలపూడి ఎంపీపీగా బాణావత్‌ రాంబాబు


చింతలపూడి మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్ని క రసవత్తరంగా జరిగింది. ఎంపీపీగా బాణావత్‌ రాంబాబు, వైస్‌ ఎంపీపీగా సాదరబోయిన వరలక్ష్మి, కో ఆప్షన్‌ సభ్యుడిగా సయ్యద్‌ యూసఫ్‌ ఎన్నికైనట్లు అధికారు ఎన్నికల అధికారి పిజి బుజ్జిబాబు ప్రకటించారు. కో ఆప్షన్‌ సభ్యు డి ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. సమావేశంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కూడా పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


చాగల్లు ఎంపీపీగా మట్టా వీరాస్వామి


చాగల్లు: ఎంపీపీగా మట్టా వీరాస్వామి, వైస్‌ ఎంపీపీగా జుజ్జవరపు రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్షన్‌ సభ్యుడిగా ఎస్‌కే సర్దార్‌ పాషా ఎన్నికయ్యారు. ముందుగా సభ్యులతో ఎన్నికల అధికారి కే.ఏసుబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి తానేటి వనిత వారిని అభినందిం చారు. జడ్పీటీసీ గారపాటి విజయదుర్గ, గండ్రోతు సురేంద్రకుమార్‌, కొఠారు అశోక్‌బాబా, ఆత్కూరి దొరయ్య, తదితరులు పాల్గొన్నారు.


వేలేరుపాడు ఎంపీపీగా లక్ష్మీదేవి


వేలేరుపాడు: సుదీర్ఘ కాలం అనంతరం మండల పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. సభ్యులతో రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీపీగా వాళ్ల లక్ష్మీదేవి, వైస్‌ ఎంపీపీగా కేశగాని వెంకటేశ్వ రమ్మ, కోఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. భాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుని విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.


కుక్కునూరు ఎంపీపీగా చేబ్రోలు గీతావాణి


కుక్కునూరు: ఎంపీపీగా చేబ్రోలు గీతావాణి ప్రమాణ స్వీకారం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారుల సమక్షంలో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. వైస్‌ ఎంపీపీగా తాండ్ర రాజేష్‌, కోఆప్షన్‌ సభ్యులుగా షేక్‌ సలీం ఎన్నికయ్యారు. ఎంపీడీవో లక్ష్మీకాంతం, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, వైసీపీ నాయకులు కుచ్చర్లపాటి కృష్ణంరాజు, కుచ్చర్లపాటి నరసింహరాజు, రావు వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.


గోపాలపురం ఎంపీపీగా ఉండవల్లి సత్యనారాయణ


గోపాలపురం: మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఉండవల్లి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీడీపీ ఆర్‌.శ్రీధేవి, రిటర్నింగ్‌ అఽధికారి రమేష్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమంలో సభ్యులు చేతులెల్తి ఆమోదాన్ని తెలియజేశారు. వైస్‌ ఎంపీపీగా బాలిన వెంకటేశ్వర మ్మ, కోఅప్షన్‌ సభ్యుడిగా షేక్‌ మస్తాన్‌బాబాను సభ్యులు ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేశారు.


టి.నరసాపురం ఎంపీపీ లక్ష్మిని సన్మానిస్తున్న జడ్పీటీసీ, సభ్యులు

టి.నరసాపురం ఎంపీపీగా దారబోయిన లక్ష్మి


టి.నరసాపురం: ఎంపీపీగా దారబోయిన లక్ష్మిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఎంపీటీసీ సభ్యులతో రిటర్నింగ్‌ అధికారి గురజాల వెంకటేశ్వరరావు ప్రమా ణస్వీకారం చేయించారు. కోఆప్షన్‌ సభ్యుడిగా మహ్మద్‌ జానీ ఎంపికయ్యారు. వైస్‌ ఎంపీపీకి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో శనివారానికి వాయిదా వేసినట్టు ఆర్‌వో తెలిపారు. జడ్పీటీసీ సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, శ్రీనురాజు, తహసీల్దార్‌ కె.నవీన్‌కుమార్‌, ఎంపీడీవో కేపీ కామేశ్వరి, కొత్త ప్రకాష్‌బాబు, దాసరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


కొయ్యలగూడెం ఎంపీపీగా గంజిమాల రామారావు


కొయ్యలగూడెం: మండల పరిషత్‌ అధ్యక్షుడిగా గంజిమాల రామారావు ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలో రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్‌ ఎంపీపీగా తుమ్మలపల్లి గంగరాజు, కోఅప్షన్‌ సభ్యుడిగా షేక్‌బాజీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీపీ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన ప్రజాప్రతినిధులను నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.


దేవరపల్లి ఎంపీపీగా దుర్గారావు


దేవరపల్లి: మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎంపీపీగా కేవీకే దుర్గారా వు, వైస్‌ ఎంపీపీగా కొర్లపాటి అరుణ, కోఆప్షన్‌ సభ్యుడిగా సయ్యద్‌ గాలిబ్‌ ఎంపికయ్యారు. ఎన్నికల అధికారి రామస్వామి, ఎంపీపీ, ఎంపీటీసీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఏఎంసీ చైర్మన్‌ గన్నమని జనార్థనరావు, కూ చిపూడి సతీష్‌, జడ్పీటీసీ పొట్టి స్వర్ణలత, ఎంపీడీవో ప్రసాద్‌, ఎం. రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తాళ్లపూడి ఎంపీపీగా జొన్నకూటి పోశిరాజు


తాళ్లపూడి: ఎంపీపీగా జొన్నకూటి పోశిరాజు ఎంపికయ్యారు. ముందుగా సభ్యులతో ఎన్నికల అధికారిణి కృష్ణవేణి, ఎంపీడీవో రాజశేఖర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్‌ ఎంపీపీగా కొండేపాటి రత్నకుమారి, కోఆప్షన్‌ సభ్యులుగా పసలపూడి కటాక్షం ఎంపికయ్యారు.


జంగారెడ్డిగూడెం ఎంపీపీగా కొదమ జ్యోతి



జంగారెడ్డిగూడెం: ఎంపీపీగా కొదమ జ్యోతి, వైఎస్‌ ఎంపీపీగా కేతవరానికి చెందిన నరెడ్ల వెంకటసుబ్బారావు, కోఆప్షన్‌ సభ్యుడిగా లాల్‌ అహ్మద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి తాతారావు ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ముందుగా ఎంపీటీసీ సభ్యు లు అందరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎంపీడీవో వేణుగోపాలరెడ్డి, తహసీల్దార్‌ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ద్వారకాతిరుమల ఎంపీపీ మోహిని దంపతులకు సత్కారం

ద్వారకాతిరుమల ఎంపీపీగా బొండాడ మోహిని


జంగారెడ్డిగూడెం(ద్వారకాతిరుమల): మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా బొండాడ మోహిని వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. వైస్‌ ఎంపీపీగా యలమర్తి దుర్గదేవి, కోఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ బాషా ఎంపికయ్యారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.


లింగపాలెం ఎంపీపీగా ముసునూరి వెంకటలక్ష్మి


చింతలపూడి (లింగపాలెం): మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ముసు నూరి వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. ఆమెతో రిటర్నింగ్‌ అధికారి మహేంద్ర నాథ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్‌ ఎంపీపీగా మట్టా సురేష్‌, కోఆప్ష న్‌ సభ్యుడిగా మాదాసు పెద్దిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 


జీలుగుమిల్లి ఎంపీపీ ఎన్నిక వాయిదా


జీలుగుమిల్లి, సెప్టెంబరు 24: మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడింది. అధికార పార్టీలో ఎంపీపీ పదవి కోసం ఇద్దరు పోటీ పడడంతో ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. అధికార పార్టీలో మరో వర్గం నుంచి ఇద్దరు, టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. కోరం పూర్తి కాకపోవడంతో సా యంత్రం నాలుగు గంటల వరకు వేచి చూసిన ఎన్నికల అధికారి సి.మధు భూషణరావు, ఎంపీడీవో నిమ్మగడ్డ బాలాజీ, ఈవోపీఆర్డీ ఎవి.సుబ్బరాయన్‌ ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రానికి పార్టీ నేతల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. మూడేళ్లు కొర్స పోశమ్మ, రెండేళ్లు సున్నం సురేష్‌కు ఎంపీపీగా కొనసాగడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీటీసీలంతా శనివారం ఎన్నికల అధికారి ముందు హాజరుకానున్నారు.

––––––––––––––––––––