Abn logo
Sep 30 2020 @ 00:20AM

భారత్-జర్మనీ మధ్య విమాన సర్వీసులను రద్దు చేసిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్

Kaakateeya

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ భారత్-జర్మనీ మధ్య విమాన సేవలను రద్దు చేసింది. భారత ప్రభుత్వంతో వివాదం తలెత్తడంతో లుఫ్తాన్సా ఈ నిర్ణయం తీసుకుంది. లుఫ్తాన్సా విమానాల షెడ్యూల్‌ను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో.. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 20 మధ్య నడపాల్సిన సర్వీసులను దురదృష్టవశాత్తు రద్దు చేయాల్సి వస్తోందంటూ లుఫ్తాన్సా ఓ ప్రకటన విడుదల చేసింది. 

జర్మనీతో చేసుకున్న ఎయిర్ బబూల్ ఒప్పందంలో భాగంగా లుఫ్తాన్సా భారత్-జర్మనీ మధ్య వారానికి 20 విమానాలు నడుపుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. ఇదే సమయంలో భారత్‌కు చెందిన విమాన సర్వీసులు వారానికి కేవలం మూడు నుంచి నాలుగు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు డీజీసీఏ పేర్కొంది. ఈ లెక్కన భారత సర్వీసులకు గణనీయమైన ప్రతికూలత ఎదురవుతున్నట్టు చెప్పింది.

ఈ నేపథ్యంలో వారానికి ఏడు విమానాలను మాత్రమే నడపాల్సిందిగా లుఫ్తాన్సాకు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను లుఫ్తాన్సా తిరస్కరించింది. ప్రస్తుతం దీనిపై ఇరువైపులా చర్చలు జరుగుతున్నాయి.  

Advertisement
Advertisement
Advertisement