Advertisement
Advertisement
Abn logo
Advertisement

`పెళ్లి చేసుకుంటే ఎలా పోషిస్తావు`.. ప్రేయసి ప్రశ్నకు సమాధానం చెప్పలేక అతను ఏం చేశాడంటే..!

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. అయితే బాధ్యత లేకుండా తిరిగే ఆ యువకుడికి ప్రేయసి అడిగిన ఓ ప్రశ్న ఆగ్రహం తెప్పించింది.. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేక ప్రేయసినే అతడు కడతేర్చాడు.. కోపంలో ఆమె తలను చితక్కొట్టాడు.. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో జరిగింది. 


కోర్బాలోని అటల్ అవాస్ కాలనీకి చెందిన సుజన్ మల్లిక్ (20), మౌనిక (19) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి గురించి మౌనికపై తరచుగా సుజన్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అయితే ఉద్యోగం లేకపోతే పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో మౌనిక తిరస్కరిస్తూ వస్తోంది. సోమవారం ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో `పెళ్లి చేసుకుంటే ఎలా పోషిస్తావు?`, `నీకు ఉద్యోగం రాకపోతే మన పెళ్లి జరగదు` అని మౌనిక తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన సుజన్.. మౌనికను మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. 


అక్కడ మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సుజన్.. మౌనిక తలను పలుసార్లు బలంగా గొడకేసి కొట్టాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో మౌనక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భయపడిన సుజన్ వెంటనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలోకి పారిపోయాడు. హతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అడవిలో గాలించి సుజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement