Abn logo
Apr 7 2020 @ 11:38AM

జూలైలో `లవ్‌స్టోరీ`.. ఆగస్టులో `వకీల్ సాబ్`?

కరోనా మహమ్మారి టాలీవుడ్ ప్రణాళికలన్నింటినీ అతలాకుతలం చేసింది. ఎన్నో సినిమాల విడుదలలను అడ్డుకుంది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు, థియేటర్లు బంద్ అయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత కొత్త విడుదల తేదీల గురించి చర్చించుకోవాలని టాలీవుడ్ నిర్మాతలు అనుకుంటున్నారట. 


అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న `లవ్‌స్టోరీ`ని మే 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు మే నెలలో విడుదలవుతుండడంతో `లవ్‌స్టోరీ` రిలీజ్ వాయిదా పడినట్టు సమాచారం. జూలై నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. పవన్‌కల్యాణ్ `వకీల్ సాబ్` ఆగస్టుకు వాయిదా పడినట్టు సమాచారం. ఇంకా ఈ సినిమా షూటింగ్ కొంత మిగిలి ఉంది. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారట. 

Advertisement
Advertisement
Advertisement