Abn logo
Jun 3 2020 @ 23:45PM

ప్రేమ... జీవితం... పకోడి!

కార్తీక్‌ బిమల్‌ రెబ్బా, సంచితా పొనాచ జంటగా మధుర శ్రీధర్‌రెడ్డి సమర్పణలో జయంత్‌ గాలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘లవ్‌, లైఫ్‌ అండ్‌ పకోడి’. ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది. థియేటర్లు తెరచుకోగానే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. దర్శక, నిర్మాత జయంత్‌ గాలి మాట్లాడుతూ ‘‘పాశ్చాత్య సంస్కృతిలో ఈతరం యువత జీవనశైలిని ప్రతిబింబించే చిత్రమిది. ప్రేమలో ఉన్నామని చెప్పడానికి గందరగోళానికి గురయ్యే ఓ జంటకు తమ ప్రేమే, ఎలా సమస్యగా మారిందనేది చిత్రకథ. ఆసక్తికరంగా రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వెంకట్‌ సిద్ధారెడ్డి, సంగీతం: పవన్‌.


Advertisement
Advertisement
Advertisement