Apr 22 2021 @ 01:07AM

ప్రేమ గుడ్డిదే కానీ...

‘ప్రేమ గుడ్డిదే. కానీ, వివక్ష చూపించదు’ అంటోంది ‘మాస్ట్రో’ చిత్రబృందం! నితిన్‌, నభా నటేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందులో నితిన్‌ అంధునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంధుడైన అతడిని ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ ప్రేమను ఉద్దేశిస్తూ... అలా చెప్పారన్నమాట. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం నితిన్‌, నభ జంటగా ఉన్న స్టిల్‌ విడుదల చేశారు. సినిమాలో నభా నటేశ్‌ లుక్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉందని దర్శకుడు తెలిపారు. తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు.