Abn logo
Aug 3 2020 @ 23:29PM

మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘మాస్టర్’ దర్శకుడి చిత్రం

ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థ ఇప్పటికే స్టార్ హీరోలందరితో సినిమా చేసింది. మంచి కథాబలమున్న సినిమాలు తీయడంలో మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఈ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. రెండు మూడు సినిమాలు మినహా.. ఈ బ్యానర్‌లో పరాజయం పాలైన సినిమాలు చాలా తక్కువే. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తున్నా కూడా.. టాప్ దర్శకులతో సినిమాలు చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అడ్వాన్స్‌లతో దర్శకులను లాక్ చేస్తోంది.


తెలుగు దర్శకులే కాకుండా ఇతర భాషల దర్శకులు కూడా ఇప్పుడీ సంస్థ లిస్ట్‌లో ఉండటం విశేషం. ‘కెజియఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు అల్రెడీ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో హిట్ దర్శకుడిని కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హిట్ దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరు? ‘ఖైదీ’ చిత్రంతో అందరినీ కట్టిపడేసిన లోకేష్ కనగరాజ్. ‘ఖైదీ’ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన లోకేష్ కనగరాజ్‌ను ‘మాస్టర్’తో అందరినీ మరోసారి మెప్పించబోతున్నాడు. ఇప్పుడీ దర్శకుడిని మైత్రీ వారు లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏ హీరోతో అనేది మాత్రం ఇంకా తెలియలేదు. త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో చేసే హీరో, మూవీకి సంబంధించిన డిటైల్స్ రానున్నాయని అంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement